Telugu Gateway
Top Stories

ఫైజర్ కు మోడెర్నా షాక్

ఫైజర్ కు మోడెర్నా షాక్
X

దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్ కు మోడెర్నా షాకిచ్చింది. ఫైజర్ తమ వ్యాక్సిన్ 90 శాతం సమర్థతతో పనిచేస్తుందని ప్రకటిస్తే..ఇప్పుడు మోడెర్నా వ్యాక్సిన్ 94.5 శాతం సమర్థతతో పనిచేస్తుందనే వార్తలు వెలువడ్డాయి. కంపెనీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఫైజర్ షేర్లు ఏకంగా ఐదు శాతం మేర పతనం అయ్యాయి. అంతే కాదు..ఫైజర్ వ్యాక్సిన్ ను నిల్వ చేసేందుకు ప్రపంచంలోనే అరుదైన పరిజ్ణానంతో కూడిన శీతల కేంద్రాలు అవసరం. అదే మోడెర్నా వ్యాక్సిన్ కు అయితే మామూలు ఫ్రిజ్ లోనే నిల్వ చేయవచ్చు. ఈ పరిణామాలు అన్నీ ఫైజర్ కు ప్రతికూలంగా మారాయి. అదే సమయంలో వ్యాక్సిన్ విజయవంతం వార్తలతో మోడెర్నా షేర్ దూసుకెళుతోంది.

అయితే మార్కెట్లోకి ఎవరు ముందు వ్యాక్సిన్ తెస్తారు..ఏది మంచి పలితాలు ఇస్తుంది అన్నది వేచిచూడాల్సిందే. ఈ తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు అంటోనీ పౌచీ మోడెర్నా వ్యాక్సిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వ్యాక్సిన్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. 75 శాతం సమర్థతతో వ్యాక్సిన్ వస్తేనే తాను చాలా సంతృప్తి చెందేవాడినని, అలాంటిది 94.5 శాతం సమర్థతతో టీకా రావటం అనేది గొప్ప విషయం అని వ్యాఖ్యానించారు. మోడెర్నా వ్యాక్సిన్ తో తమపై విమర్శలు చేసిన వారు ఇక మౌనం వహిస్తారని ఆశిస్తున్నట్లు పౌచీ వ్యాఖ్యానించారు.

Next Story
Share it