Telugu Gateway
Top Stories

మోడెర్నా వ్యాక్సిన్ కూ ఎఫ్ డీఏ అనుమతి!

మోడెర్నా వ్యాక్సిన్ కూ ఎఫ్ డీఏ అనుమతి!
X

కరోనా కష్టాల్లో ఉన్న అమెరికాకు పెద్ద ఊరట. ఇఫ్పటికే ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా...ఈ వారంలోనే మోడెర్నా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎప్ డీఏ) ఈ వ్యాక్సిన్ కు సంబంధించి కూడా అత్యవసర వాడకానికి అనుమతి మంజూరు చేయనుంది. మోడెర్నా వ్యాక్సిన్ సురక్షితం, సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు ఎఫ్ డీఏ గుర్తించింది. కంపెనీ అందజేసిన డేటా ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే అమెరికాలో కరోనా కారణంగా మూడు లక్షల మంది చనిపోవటంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.

ఇప్పుడు మోడెర్నా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే ఈ నెలలోనే 20 మిలియన్ల వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం పూర్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. నిపుణుల కమిటీ గురువారం నాడు వ్యాక్సిన్ సమర్ధతపై సిఫారసు చేయనుంది. అది పూర్తయిన వెంటనే ఎఫ్ డీఏ అనుమతి మంజూరు చేయనుంది. మోడెర్నా వ్యాక్సిన్ 94.1 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. పెద్దల విషయంలో అసలు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని నివేదికలు చెబుతున్నాయి. ఓ వైపు ఫైజర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇఫ్పటికే ప్రారంభం అయింది. మోడెర్నా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే ఈ కార్యక్రమం మరింత వేగంగా పుంజుకోనుంది.

Next Story
Share it