Telugu Gateway
Top Stories

ఈడీ కేసు..ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

ఈడీ కేసు..ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
X

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. ఆమె గురువారం నాడు అంటే మార్చి 16 న ఈడీ విచారణకు హాజరు అవుతున్నట్లు ముందు రోజు అంటే బుధవారం నాడు ప్రకటించారు. కవిత హాజరు అవుతారనే ఉద్దేశంతోనే ఆమె సోదరుడు, మంత్రి కెటిఆర్ తో పాటు మరికొంత మంది మంత్రులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు కూడా ఢిల్లీ చేరుకున్నాయి. అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ నివాసం దగ్గర పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో మాత్రం ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె ఈడీ అధికారులకు ఏమి సమాచారం పంపారు అన్నది అధికారికంగా బయటకు రాలేదు కానీ ఆమె మాత్రం ఈడీ విచారణకు హాజరు కాలేదు.

దీనికి సుప్రీం కోర్ట్ లో తన పిటిషన్ పెండింగ్ లో ఉండటం వంటి అంశాలను ప్రస్తావించినట్లు చెపుతున్నారు. దీనికి ముందు ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసిన కవిత తన విచారణపై స్టే ఇవ్వటం తో పాటు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఆదేశించాలని కోరగా..ఆమెకు ఊరట లభించలేదు. దీంతో ఆమె విచారణకు హాజరు కావల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చివరి నిమిషంలో ఆమె ఈడీ కి సమాచారం పంపటం తో ఆ విచారణ సంస్థ ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

Next Story
Share it