Telugu Gateway
Top Stories

ప్రపంచ వ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం

ప్రపంచ వ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం
X

ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నాడు పలు ఎయిర్ లైన్స్ సర్వీస్ లకు మైక్రో సాఫ్ట్ దెబ్బపడింది. మైక్రో సాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్ లో సమస్యలు రావటంతో అటు ఎయిర్ లైన్స్ తో పాటు బ్యాంకు లు, టెలీకమ్యూనికేషన్స్, సూపర్ మార్కెట్ లు సమస్యలు ఎదుర్కొన్నాయి. ఇండియాలో ఇండిగో తో పాటు విస్తార, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్స్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఆయా ఎయిర్ లైన్స్ ఈ మేరకు ప్రకటనలు కూడా విడుదల చేశాయి. మైక్రో సాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సమస్యల వల్ల బుకింగ్ తో పాటు చెక్ ఇన్ , ఫ్లైట్ అప్డేట్ సర్వీసుల్లో సమస్యలు వస్తున్నాయి అని వెల్లడించాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇదే సమస్య తెలెత్తింది.

అక్కడ అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్ , యునైటెడ్ ఎయిర్ లైన్స్ సర్వీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో బ్లూ స్క్రీన్ ప్రత్యక్షం అయింది. ఈ సమస్యపై మైక్రో సాఫ్ట్ కూడా స్పందించింది. ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వల్ల ఈ సమస్య వచ్చింది అని..వెంటనే సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. విండోస్ పీసి లకు క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ తో సైబర్ సెక్యూరిటీ సేవలు మరింత మెరుగు అవుతాయి అని తెలిపింది. సమస్యను గుర్తించినందున దాన్ని ఫిక్స్ చేయటానికి చర్యలు ప్రారంభించినట్లు పేర్కొంది.

Next Story
Share it