Telugu Gateway
Top Stories

ఏఐ లో దూసుకెళుతున్న కంపెనీ

ఏఐ లో దూసుకెళుతున్న కంపెనీ
X

మంచి లాభాలు గడించే కంపెనీలు ప్రతి ఏటా తమ ఉద్యోగాలకు ఇంక్రిమెంట్స్..బోనస్ లు ఇస్తాయి. ఇక దిగ్గజ ఐటి కంపెనీల సీఈఓ ల జీతాలు చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోవాల్సిందే. ఇప్పుడు ఐటి రంగంలో ఎక్కడ చూసినా బజ్ వర్డ్ అంటే కృత్రిమ మేధ (ఏఐ). ఈ రంగంలో ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీల జాబితా లో ఉండే మైక్రోసాఫ్ట్ మంచి ప్రగతి సాధించింది. దీంతో కంపెనీ సీఈఓ సీఈఓ సత్య నాదెళ్లకు కు ఇచ్చే వేతనం భారీగా పెంచుతూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆయనకు 2025 సంవత్సరంలో మన భారతీయ కరెన్సీ లో చూసుకుంటే 846 కోట్ల రూపాయల వేతనం దక్కనుంది. ఈ విషయాన్నీ మైక్రోసాఫ్ట్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది.గత ఏడాది అంటే 2024 లో ఆయన వేతనం 664 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇప్పుడు 22 శాతం మేర అధిక వేతనం దక్కనుంది.

ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ మంచి పని తీరు కనపర్చటంతో కంపెనీ షేర్లు కూడా భారీ లాభాలు గడించాయి. దీంతో ఆయనకు మరో 80 కోట్ల రూపాయల నగదు ప్రోత్సహకం కూడా ప్రకటించారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన సత్య నాదెళ్ల 1992 లో మైక్రోసాఫ్ట్ లో చేరి వివిధ హోదాల్లో పని చేశారు. 2014 లో ఆయన అమెరికాలోని నంబర్ వన్ ఐటి కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నియమితులు అయ్యారు. ప్రపంచంలోనే దిగ్గజ ఐటి కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్ తో పాటు గూగుల్ సిఈఓ లుగా భారతీయులు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. వీళ్ళ సారధ్య బాద్యతల్లో రెండు కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పురోగతి సాగిస్తున్నాయి. అందుకే వీళ్లకు అందించే వేతనాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.

Next Story
Share it