Telugu Gateway
Top Stories

సత్య నాదెళ్ల కుటుంబంలో విషాదం

సత్య నాదెళ్ల కుటుంబంలో విషాదం
X

అతడి వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలే. కానీ అప్పుడే వందేళ్లు నిండిపోయాయి. పుట్టుకతోనే తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పుట్ట‌డంతో ఈ ప‌రిస్థితి వ‌చ్చింది. మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల కుమారుడు ఈ జైన్ నాదెళ్ళ‌. ఆయ‌న‌కు ఆర్ధిక‌ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేక‌పోయిన త‌న త‌న‌యుడికి వ‌చ్చిన జ‌బ్బును న‌యం చేయించ‌లేకపోయారు. అత్యంత ఆధునిక వైద్యం అందుబాటులో ఉండే అమెరికాలో సైతం కూడా ఇది సాధ్యం కాలేదు. అందుకే ఇంత చిన్న వ‌య‌స్సులో తుది శ్వాస విడిచాడు.

పుట్టుకతోనే జైన్​ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో(సెరెబ్రల్​ పాల్జీ) బాధపడుతున్నాడు. జైన్ మరణవార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్​ ఎక్జిక్యూటివ్​ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే 2014లో మైక్రోసాఫ్ట్​ సీఈఓగా సత్యనాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. పుట్టుక‌తోనే స‌మ‌స్య‌ల‌తో భూమిమీదకు వ‌చ్చేవారికి ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డాల‌నే ఉద్దేశంతోనే దీనికి శ్రీకారం చుట్టారు.

Next Story
Share it