Telugu Gateway
Top Stories

లాక్ డౌన్ స‌డ‌లింపుల‌పై కేంద్రం జాగ్ర‌త్త‌లు

లాక్ డౌన్  స‌డ‌లింపుల‌పై కేంద్రం జాగ్ర‌త్త‌లు
X

దేశంలో రాష్ట్రాలు అన్నీ అన్ లాక్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఈ త‌రుణంలో కేంద్రం ప‌లు సూచ‌న‌లు చేసింది. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లా అన్ని రాష్ట్రాల సీఎస్ ల‌కు లేఖ‌లు రాశారు. స‌డ‌లింపులు ఇచ్చినా అత్యంత జాగ్ర‌త్త‌గా టెస్ట్, ట్రాక్, ట్రీట్, వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. అదే స‌మ‌యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఆంక్షల విధించడం లేదా సడలింపులు ఇవ్వాలని సూచించారు. పరీక్షల సంఖ్యను ఏ మాత్రం తగ్గించకుండా కొనసాగించాల‌న్నారు.

కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలి. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేయడం చాలా కీలకం. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని సూచన. దీనికోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Next Story
Share it