Telugu Gateway
Top Stories

కెనడాలో మాటా ఉత్సవాలు

కెనడాలో మాటా ఉత్సవాలు
X

విదేశాల్లో తెలుగు వారు సంక్రాంతి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.... కెనడా లోని నోవస్కోషియా ప్రావిన్స్ లోని హాలీఫ్యాక్స్ నగరం లో మారి టైం తెలుగు అసోసియేషన్(MATA) ఆధ్వర్యంలో మన తెలుగు వారు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా జరిగాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు... తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు ఫాషన్ షో నిర్వహించారు. 2023 తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించారు నిర్వాహకులు. నిత్యం ఉద్యోగాలు, ఆఫీస్ పనుల్లో ఉండే వీరంతా వారాంతాల్ల్లో మన సంస్క్రతి , సంప్రదాయాలు కొనసాగించేలా ఈ ఉత్సవాలు చేశారు.

Next Story
Share it