విమానాశ్రయాలు..విమానాల్లో మాస్క్ లు తప్పనిసరి
విమాన ప్రయాణికులకు మాస్క్ కష్టాలు మరికొంత కాలం తప్పేలా కన్పించటం లేదు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు..విమాన ప్రయాణాల్లో ఇంకా మాస్క్ నిబంధన తప్పనిసరే. దేశంలోని విమానాశ్రయాలు..విమాన ప్రయాణాల్లో మాత్రం మాస్క్ లు ధరించాల్సిందేనని డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అరుణ్ కుమార్ తెలిపారు. విమాన ప్రయాణ సమయంలో మాస్క్ లు పెట్టుకోవాలని తాను సూచిస్తున్నామని తెలిపారు. దేశాన్ని కోవిడ్ వణికించిన సమయంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు అయిన ముంబయ్, ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పుడు మాస్క్ నిబంధన తొలగించారు. అయితే ఈ నగరాల్లోని ప్రయాణికులు కూడా విమాన ప్రయాణ సమయాల్లో తప్పనిసరిగా మాస్క్ లు పెట్టుకోవాల్సిందేనని ఆయన సూచించారు. గతంలో విమాన ప్రయాణికులు ఎవరైనా మాస్క్ పెట్టుకోవటానికి నిరాకరిస్తే అలాంటి వారిని విమానాల నుంచి దింపేశారు కూడా.
ఆ నిబంధన ఇప్పటికీ కూడా కొనసాగుతుందని..విమానాశ్రయాల్లో..విమాన ప్రయాణ సమయంలో మాస్క్ పెట్టుకోవాలని తేల్చిచెప్పారు. మాస్క్ ధరించటంతోపాటు శానిటేజర్ వాడకం వంటివి మంచిదన్నారు. దేశంలోని పలు కీలక నగరాల్లో మాస్క్ నిబంధనను తొలగించారు. అయితే అది విమానాశ్రయాల్లో మాత్రం కాదని డీజీసీఏ చెబుతోంది. దేశంలో కోవిడ్ కేసులు తాజాగా వెయ్యికి దిగొచ్చాయి. రాష్ట్రాలు అన్నీ నిబంధనలు ఎత్తేశాయి. మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించాయి. అయితే జనసమూహల్లో ఉన్న సమయంలో మాత్రం మాస్క్ తో పాటు భౌతిక దూరంవంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కీలక నగరాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నా విమానాశ్రయాలు..విమానాల్లో మాత్రం మాస్క్ మస్ట్ అని తేల్చారు.