లడఖ్ లో మారుతీ యాడ్ షూటింగ్ పై దుమారం

దేశం నుంచే కాదు...విదేశాల నుంచి కూడా లడఖ్ లో ప్రకృతి సౌందర్యం చూసేందుకు పర్యాటకులు ఇక్కడకు పెద్ద ఎత్తున వస్తారు. అలాంటి లడఖ్ లో మారుతీ సుజుకి ఒక కారు కు సంబంధించి యాడ్ షూటింగ్ చేసింది. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది. పర్యావరణ పరంగా లడఖ్ అత్యంత సున్నితమైన ప్రాంతం. అయితే ఇక్కడ వాణిజ్య ప్రయోజనాల కోసం యాడ్ షూట్ చేయటంపై ఆ ప్రాంత ఎంపీ జాంయాంగ్ త్సేరింగ్ నంజీయల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయన ఈ యాడ్ షూటింగ్ కు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఇది బాధ్యతారాహిత్య చర్య అంటూ విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల పర్యావరణం దెబ్బ తింటుంది అని తెలిపారు. లడఖ్ లో ఉన్న ప్రత్యేక సౌందర్యాన్ని కాపాడాలి. ...దీన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఈ యాడ్ షూటింగ్ కు కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని అయన అధికారులను ఆదేశించారు.ఒక లేక్ లో మారుతి వాహనం తిప్పుతూ షూటింగ్ జరిపారు.



