భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్ లు సోమవారం నాడు భారీ నష్టాలతో మొదలు అయ్యాయి. ప్రారంభం నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఉదయం పది గంటల సమయంలో బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 670 పాయింట్ల కు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 188 పాయింట్ల నష్టంతో 25991 పాయింట్ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త వాతావరణం స్టాక్ మార్కెట్ లపై ప్రభావం చూపించింది. దీనికి తోడు గత కొంత కాలంగా మార్కెట్ లు దూసుకువెళుతున్నాయి తప్ప ఎక్కడా పెద్దగా కరెక్షన్ వస్తున్న దాఖలాలు లేవు అనే చెప్పొచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న వాతావరణం ఎటు వైపు మలుపులు తీసుకుంటుందో అన్న టెన్షన్ మార్కెట్ వర్గాల్లో ఉంది.
అందుకే ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవరిస్తున్నారు. మరో వైపు ఈ వారం ఆర్ బీఐ పరపతి సమీక్ష కూడా ఉండటంతో అందరి కళ్ళు దీనిపైనే ఉన్నాయని చెప్పొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పటికే 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. రాబోయే రోజుల్లో కూడా తగ్గింపులకు ఛాన్స్ ఉంది స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అయితే మరి ఆర్ బీఐ ఫెడ్ మోడల్ ను ఫాలో అవుతుందా...లేదా దేశీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందా అన్నది వేచిచూడాల్సిందే. అటు సెన్సెక్స్ తో పాటు నిఫ్టీ లోని కీలక షేర్లు ఎక్కువగా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.