Telugu Gateway
Top Stories

ప్రాణం తీసిన సరదా పోటీ

ప్రాణం తీసిన సరదా పోటీ
X

సరదా కోసం వేసుకునే కొన్ని పందాలు ప్రమాదాలు తెచ్చిపెడతాయి. ఇది కూడా అలాంటిదే. ఒక ఆఫీస్ లో ఉద్యోగులు పందెం కోసుకున్నారు. అంతే ఒక వ్యక్తి పదే పది నిమిషాల్లో ఒక లీటర్ ఆల్కహాల్ తాగేశాడు. అది కూడా స్ట్రాంగ్ లిక్కర్. ఈ పందెం ఖరీదు రెండు లక్షలు. ఆఫీస్ పార్టీ పేరుతో సాగిన పందెంలో ఇలా లిక్కర్ తగిన వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వేంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఈ మద్యం సేవించిన వ్యక్తి బాడీలో మద్యం విషంగా మారటంతో పాటు శ్వాస సమస్యలు..న్యూమోనియా, హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు. డాక్టర్లు మద్యం సేవించిన వ్యక్తిని కప్పేదేందుకు చేసిన ప్రయత్నాలు ఏమి ఫలించలేదు.

ఆఫీస్ లో సాగిన ఈ మందు పోటీ తర్వాత ఆ కంపెనీ ని మూసి వేశారు. ఈ తతంగం అంతా జరిగింది చైనాలో. జహాంగ్ అనే వ్యక్తి చైనీస్ బైజీయూ స్పిరిట్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ లు ఈ కేసు విచారణ చేస్తున్నారు. ఆఫీస్ లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి ఆఫీస్ లో రకరకాల పార్టీ లు చేసుకుంటారు. ఇది ప్రతి చోట జరిగేదే. కానీ ఇలా గంటలో ఏకంగా లీటర్ మద్యం సేవించి..అది కూడా రెండు లక్షలు గెలుచు కోవటం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన కలకలం రేపింది.

Next Story
Share it