Telugu Gateway
Top Stories

మాల్స్ కు 3000 కోట్ల నష్టం

మాల్స్ కు 3000 కోట్ల నష్టం
X

షాపింగ్ మాల్స్ కు కరోనా ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. గత ఏడాదిన్నరగా దేశంలో కరోనా ఏదో ఒక రూపంలో సమస్యలు సృష్టిస్తూనే ఉంది. తొలి దశ నుంచి కోలుకున్నాక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఎవరూ ఊహించని స్థాయిలో సెకండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు అన్నీ వరసగా లాక్ డౌన్లు ప్రకటిస్తూ పోయాయి. దీంతో ఎనిమిది వారాల్లోనే మాల్స్ కు 3000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. అన్ని విభాగాలు కలుపుకుంటే ఈ నష్టం 25 వేల కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా (ఎస్ సీఏఐ) ఈ వివరాలు వెల్లడించింది. రాష్ట్రాలు మాల్స్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతించాలని కోరుతున్నారు. రిటైల్ విభాగంలోని అన్ని కేటగిరీల్లోనూ 25 శాతం మేర వ్యాపారం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడితే వాణిజ్య, ఆఫీసు స్పేస్ కు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో షాపింగ్ మాల్ ఓనర్లు తమ రుణాలపై మారటోరియాన్ని పొడిగించాలని కోరుతున్నారు.

Next Story
Share it