ఫస్ట్ ప్లేస్ లో ఢిల్లీ...సెకండ్ ముంబై
ఇటీవల ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ గురుగ్రామ్ దగ్గర 17 ఎకరాల్లో దలియాస్ అనే ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో అపార్ట్ మెంట్ కనీస స్పేస్ 10300 చదరపు అడుగులు. ధర 80 కోట్ల రూపాయలపైనే. ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 420 అల్ట్రా లగ్జరీ అపార్ట్ మెంట్స్ డెవలప్ చేయబోతున్నారు. 2024 జనవరి -సెప్టెంబర్ కాలంలో దేశ వ్యాప్తంగా 12625 యూనిట్ ల లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జరగ్గా ..గత ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 9160 మాత్రమే. ప్రీమియం సెగ్మెంట్ ఇళ్ల అమ్మకాల విషయంలో జాతీయ రాజధాని ప్రాంతం ( ఎన్ సిఆర్ ) ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే ..రెండవ ప్లేస్ లో ముంబై ఉంది. ఒక్క ముంబై నగంరంలోనే 2200 కోట్ల రూపాయల విలువ గల 21 యూనిట్ల విక్రయం జరిగింది. హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరు ల్లో 40 కోట్ల రూపాయల విలువైన 25 అల్ట్రా లగ్జరీ యూనిట్ల అమ్మకాలు జరిగాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. మార్కెట్ లో మిడ్ సైజు కార్లతో పాటు ఇళ్ల అమ్మకాలు కూడా పెరిగితేనే అంతా బాగున్నట్లు లెక్క అని..అలా కాకుండా కేవలం సంపన్నులు కొనుగోలు చేసే కార్లు...ఇళ్ల అమ్మకాలు మాత్రమే పెరుగుతుంటే మాత్రం ఏదో లెక్క తేడా ఉంది అనే సంకేతాలు అందుతున్నాయని గ్రహించాలని చెపుతున్నారు.