దేశంలో అతి పెద్ద మాల్

అబుదాబికి చెందిన లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్ భారత్ లో అతిపెద్ద మాల్ ను ప్రారంభించింది. ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉంది. రెండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు. మొత్తం 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అతిపెద్ద మాల్ ను నిర్మించారు. ఇందులో ఏకంగా 11 అంతస్థులు పార్కింగ్ కోసమే కేటాయించారు. ఇందులోని ఫుడ్ కోర్టులో ఏకంగా ఒకేసారి 1600 మంది కూర్చుని విందు ఆరగించేలా ఏర్పాట్లు చేశారు. ఉత్తర భారత దేశంలో లూలూ గ్రూప్ నిర్మించిన అది పెద్ద మాల్ ఇదే.
లూలూ గ్రూప్ ఇప్పటికే భారత్ లో కొచ్చితోపాటు బెంగుళూరు, తిరువనంతపురం, త్రిసూర్ లో మాల్స్ నిర్వహిస్తోంది. లక్నో మాల్ ను ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించినట్లు లూలూ గ్రూప్ వెల్లడించింది.ఇందులో అతి పెద్ద ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ జోన్ ఫన్ టూరా కూడా ఉంది. పెళ్లిళ్లకు కావాల్సిన అభరణాల విక్రయానికి సంబంధించి ప్రత్యేక ఏరియాను కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండే కీలక బ్రాండ్లు అన్నీ కూడా ఈ మాల్ లో దొరుకుతాయి.



