లాటరీ టిక్కెట్లు అమ్మే వ్యక్తికే జాక్ పాట్ తగిలితే..!
BY Admin21 Jan 2021 4:11 PM

X
Admin21 Jan 2021 4:11 PM
అదృష్టం అంటే ఇదే. లాటరీ టిక్కెట్లు అమ్మే వ్యక్తికే జాక్ పాట్ తగిలింది.అది కూడా ఎంత మొత్తమో తెలుసా?. ఏకంగా 12 కోట్ల రూపాయలు. అమ్ముడుపోని టిక్కెట్ కే 12 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. కేరళలోని కొల్లామ్ కు చెందిన 46 సంవత్సరాల షరాఫుద్దీన్ ను ఈ అదృష్టం వరించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన క్రిస్మస్, న్యూయర్ బంపర్ లాటరీలో ఆయన జాక్ పాట్ దక్కించుకున్నాడు. ఈ లాటరీ డబ్బుతో అప్పులు తీర్చేసి సొంత ఇళ్లు కట్టుకుంటానని తెలిపాడు. తమిళనాడుకు చెందిన షరాఫుద్దీన్ తన ఐదుగురు కుటుంబ సభ్యులతో కలసి కొల్లాంలో నివాసం ఉంటున్నాడు. పన్నులు పోను ఆయనకు 7.5 కోట్ల రూపాయల వరకూ చేతికి వస్తాయని అంచనా.
Next Story