Telugu Gateway
Top Stories

ఢిల్లీలో లాక్ డౌన్

ఢిల్లీలో లాక్ డౌన్
X

ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. లేదంటే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విధించిన రాత్రి కర్ఫ్యూని లాక్ డౌన్ గా మార్చింది. సోమవారం రాత్రి అమల్లోకి రానున్న లాక్ డౌన్ వచ్చే సోమవారం ఉదయం ఐదు గంటల వరకూ కొనసాగనుంది. ఢిల్లీలో అత్యధికంగా ఒకే రోజు 25 వేలకుపైగా కొత్త కరోనా నమోదు కావడంతో శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారిని నిలువరించేందుకు ఏప్రిల్‌ 26వ తేదీవరకు లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ప్రజల సహకారంతో మహమ్మారిని ఎదుర్కొంటామని, లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన అవసరం రాదని భావిస్తున్నామని ఢిల్లీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన సీఎం ఢిల్లీలో నాలుగో వేవ్‌ కొనసాగుతోందని, పాజిటివ్‌ రేటు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలతో అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే పరీక్షల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే ఐసీయూ బెడ్స్‌ నిండిపోయాయి. ఆక్సి జన్‌ కొరత వేధిస్తోందని ఆయన తెలిపారు. దీనికి తోడు రోజులు 25వేలకు పైగా కేసులు రావడంతో చికిత్స అందించడం కష్టంగా మారిందన్నారు. రోజువారీ కరోనా కేసులు, మరణాల పెరుగుదల నేపథ్యంలో దేశ రాజధానిలో 7 రోజుల పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు కేజ్రీవాల్‌ ప్రకటించారు. కష్టమైనా లాక్‌డౌన్‌ తప్పలేదని, కానీ వలస కార్మికకులు ఇక్కడే ఉండాలని సూచించారు. ఇది చిన్న లాక్‌డౌన్‌ మాత్రమే..దయచేసి ఎక్కతడికీ వెళ్లకండి..ఆందోళన చెందకండి.. ప్రభుత్వం మిమ్మల్నిఆదుకుంటుంది అంటూ జోతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అయితే అవసరమైన సేవలు, ఆహార సేవలు, వైద్య సేవలు కొనసాగుతాయని తెలిపారు.

Next Story
Share it