Telugu Gateway
Top Stories

జీవిత భీమా...ఇన్వెస్టర్లకు ఏది ధీమా!

జీవిత భీమా...ఇన్వెస్టర్లకు ఏది ధీమా!
X

జీవిత భీమా సంస్థ (ఎల్ ఐసి) లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు లబోదిబో అంటున్నారు. లిస్టింగ్ దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్క సారి కూడా ఈ షేర్ లాభాలు చవిచూడక పోవటం విశేషం. అసలే ఎల్ ఐసి షేర్లు నష్టాల బాటలో సాగుతున్న వేళ మధ్యలో వెలుగులోకి వచ్చిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై బహిర్గతం చేసిన నివేదిక తర్వాత ఎల్ఐ సి షేర్లు మరింత పతనం అయిన విషయం తెలిసిందే. మధ్యలో కోలుకున్నా తిరిగి ఈ షేర్ నష్టాల బాటలో సాగుతుంది. ఇప్పుడు ఏకంగా మరో కొత్త కనిష్ట స్థాయిలకు చేరింది. ఇప్పుడు ఎల్ ఐ సి షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పతనం అయ్యాయి. ఎల్ ఐ సి షేర్లు ఇప్పుడు 537 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

మంగళ వారం నాడు ఒక దశలో 535 రూపాయలకు చేరాయి కూడా. ఈ పతనం ఎప్పుడు ఆగుతుంది....ఎల్ఐసి ఇన్వెస్టర్లు ఎప్పుడు లాభాలు సాధిస్తారు అన్నది ఇప్పుడు చెప్పే వారే కరువయ్యారు. గత ఇది మే లో ఎల్ ఐసి షేర్లు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆఫర్ ధరకు ఇవి చేరుకోలేదు. దీంతో ఇందులో పెట్టుబడి పెట్టిన, చిన్న మధ్య తరహా మదుపరులు కూడా ఇరుక్కు పోయినట్లు అయింది. స్టాక్ మార్కెట్ ఒడిడుకులు ఎదుర్కొంటున్న సమయంలోనే ఎల్ఐసి మార్కెట్ లోకి ప్రవేశించి అతి పెద్ద ఐ పీ ఓ గా 20557 కోట్ల రూపాయలు సమీకరించింది. ఆఫర్ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీ హోల్డర్స్ కు ఆఫర్ లో రాయితీ ఇచ్చిన కూడా దీని వల్ల వాళ్లకు ఎలాంటి లాభం చేకూరలేదు అనే చెప్పాలి.

Next Story
Share it