త్వరగా భారత్ వదిలిరండి
BY Admin29 April 2021 2:03 PM IST
X
Admin29 April 2021 2:03 PM IST
అమెరికా పౌరులకు ఆ దేశం మరో హెచ్చరిక చేసింది. ఇప్పటికే ఎవరూ భారత్ వెళ్లొద్దని హెచ్చరికలు చేసిన ఆ దేశం...ఇప్పుడు భారత్ లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే భారత్ ను వీడాలని..అక్కడ వైద్య సదుపాయాలు కూడా ఏమీ అందుబాటులో లేవని హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఆఫైర్స్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తో కేసులు భారీగా పెరుగుతున్నందున అనారోగ్యానికి గురైతే వైద్యం పొందడం అంత సులువు కాదు అని పేర్కొంది. ఈ మేరకు లెవల్ 4 హెచ్చరికలు కూడా జారీ చేసింది. అందుబాటులో ఉన్న రోజువారీ డైరెక్ట్ విమానాల ద్వారా యూఎస్ చేరుకోవాలని సూచించింది. నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేనిపక్షంలో వయా పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ ద్వారా స్వదేశానికి చేరుకోవాలని తెలిపింది.
Next Story