Telugu Gateway
Top Stories

పెరిగిన వాల్యూమ్స్

పెరిగిన వాల్యూమ్స్
X

స్టాక్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా లారస్ లాబ్స్ షేర్లు దూకుడు మీద ఉన్నాయి. బుధవారం నాడు ఈ కంపెనీ షేర్లు ఏకంగా 25 రూపాయల లాభంతో 52 వారాల గరిష్ట స్థాయి 636 రూపాయలకు టచ్ అయ్యాయి. కానీ చిరవరకు బిఎస్ఈ లో 19 రూపాయల లాభంతో 631 రూపాయల వద్ద ముగిశాయి. ఒక్క బిఎస్ఈ లోనే రెండు లక్షల ఎనభై వేల షేర్ల ట్రేడ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా లారస్ లాబ్స్ షేర్స్ ట్రేడింగ్ వాల్యూమ్ కూడా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. 2025 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 92 కోట్ల రూపాయలకు పెరిగింది.

కంపెనీ ఆదాయం కూడా 1,194 కోట్ల రూపాయల నుంచి 1415 కోట్ల రూపాయలకు పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా కంపెనీ ఫలితాలు కూడా ఇదే తరహాలో ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది అని కంపెనీ ప్రకటించటం కూడా ఈ షేర్లలు మదుపరుల ఆసక్తి పెరగటానికి కారణంగా చెప్పొచ్చు. ఇటీవల అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఈ షేర్ పై ప్రభావం చూపించింది. దాన్నుంచి కోలుకుని ఇప్పుడు లారస్ షేర్స్ లో ర్యాలీ కొనసాగుతోంది. మంగళవారం నాడు దూసుకెళ్లిన మార్కెట్స్ బుధవారం నాడు మాత్రం తగ్గుముఖం పట్టాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 313 పాయింట్ల నష్టంతో 78271 పాయింట్ల వద్ద ముగిసింది.

Next Story
Share it