Telugu Gateway
Top Stories

మోడీ సర్కారు కీలక నిర్ణయం

మోడీ సర్కారు కీలక నిర్ణయం
X

లోక్ సభ ఎన్నికల ముందు కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ కురువృద్ధుడు...మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్న ప్రకటించారు. ఈ విషయాన్నీ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగా స్టార్ చిరంజీవి కి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు. వీళ్ళతో పాటు మరికొంత మందికి పద్మ శ్రీ అవార్డులు కూడా ఇచ్చారు. ఇప్పుడు విడిగా అద్వానీకి భారత్ రత్న అవార్డు ప్రకటించటం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర ఎంతో కీలకం అని ప్రధాని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అద్వానీ రథ యాత్ర చేసిన విషయం తెలిసిందే. దేశంలో బీజేపీ బలపటడానికి కూడా ఇదే ప్రధాన కారణం అనే అభిప్రాయం ఉంది. అలాంటిది అయోధ్య లో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అద్వానీకి భాగస్వామ్యం కల్పించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తొలుత అయన వయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఆహ్వానం ఇవ్వటం లేదు అని ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో తర్వాత ఆయనకు ఆహ్వానం పంపారు. అద్వానీ కూడా తర్వాత చలి కారణముగా తాను అయోధ్య వెళ్ళటం లేదు అని..తర్వాత మందిరాన్ని సందర్శిస్తాను అంటూ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it