Telugu Gateway
Top Stories

కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ చేతిలోకి

కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ చేతిలోకి
X

మిగిలిన 25 శాతం వాటా కొనుగోలుకూ ఒప్పందం

డీల్ విలువ 2800 కోట్ల రూపాయలు

కృష్ణపట్నం ఓడరేవు పూర్తిగా అదానీ పరం కానుంది. ఇఫ్పటికే ఇందులో 75 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ పోర్ట్స్ తాజాగా మిగిలిన 25 వాటా కొనుగోలుకూ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 2800 కోట్ల రూపాయలు. ఈ లావాదేవీ కూడా పూర్తి అయితే కృష్ణపట్నం ఓడరేవు వంద శాతం అదానీ పోర్ట్స్ అనుబంధ సంస్థగా మారనుంది. విశ్వ సముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి అదానీ పోర్ట్స్ ఈ వాటా కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం నాడు ఎక్సేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ల్లోని ఓడరేవుల్లో తమ వాటా పెంచుకునే దిశలో భాగంగానే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది. ఇటీవలే గంగవరం ఓడరేవులో కూడా అదానీ పోర్ట్స్ దాదాపు 90 శాతం వరకూ వాటాను దక్కించుకుంది. మిగిలిన పది శాతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కృష్ణపట్నం ఓడరేవు ప్రస్తుత సామర్ధ్యం సంవత్సరానికి 64 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండ్లింగ్ చేసే సామర్ధ్యం కలిగి ఉంది. చట్టపరమైన అనుమతులు లభించిన వెంటనే ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని తెలిపారు.

Next Story
Share it