Telugu Gateway
Top Stories

కుష్పూ కారుకు ప్రమాదం

కుష్పూ కారుకు ప్రమాదం
X

ప్రముఖ నటి, బిజెపి నాయకురాలు కుష్పూ సుందర్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఉదయమం ఆమె కారును ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆమె ప్రయాణిస్తున్న వాహనం తీవ్రంగా దెబ్బతిన్నది. ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవటంతో ఆమె ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకోగలిగారు. అభిమానుల దీవెనలు, దేవుడి ఆశీస్సులతో తాను సురక్ష్తితంగా బయటపడగలిగినట్లు ఆమె ట్వీట్ చేశారు. దెబ్బతిన్న కారు ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు.

కడలూర్‌లో బీజేపీ నిర్వహిస్తున్న వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తమ దారిన తాము వెళ్తుంటే ట్యాంకర్‌ ఢీకొట్టిందని అన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఖుష్బూ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

Next Story
Share it