Telugu Gateway
Top Stories

ఐ ఫోన్ కోసం దుబాయ్..ఎవ‌రి పిచ్చివాళ్ల‌కు ఆనందం అంటే ఇదే!

ఐ ఫోన్ కోసం దుబాయ్..ఎవ‌రి పిచ్చివాళ్ల‌కు ఆనందం అంటే ఇదే!
X

యూత్ లో ఐ ఫోన్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్ర‌తి ఏడాది యాపిల్ కొత్త వెర్ష‌న్ ఐ ఫోన్ తీసుకురావ‌టం..అలా వ‌చ్చిందో లేదో దాన్ని కొనుగోలు చేయ‌టం..సోష‌ల్ మీడియాలో ఆ ఫోటోలు షేర్ చేయ‌టం చాలా మంది చేసే ప‌నే. కానీ ఓ యువ‌కుడు కేవ‌లం ఐ ఫోన్ 14 కొనుగోలు చేయ‌టం కోసం ఏకంగా దుబాయ్ వెళ్ళాడు. అది కూడా భార‌త్ లో ఫోన్ కొద్ది గంట‌ల్లో విడుద‌ల అవుతుంద‌ని తెలిసి కూడా ఈ ప‌ని చేశాడు. ఫోన్ ఖ‌రీదుకు అద‌నంగా ఆ యువ‌కుడు విమాన టిక్కెట్లు..వీసా చార్జీల కింద అద‌నంగా మ‌రో 40 వేల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టాడు. కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన వ్యాపార‌వేత్త ధీర‌జ్ ప‌ల్లియ‌ల్ ఈ ప‌ని చేసి అంద‌రి ద‌ష్టిని ఆక‌ర్షించాడు.

ఆయ‌న దుబాయ్ లో ఐఫోన్ 14 ప్రో మోడ‌ల్ ను..సెప్టెంబ‌ర్ 16న కొనుగోలు చేశాడు. అదే రోజు భార‌త్ లోనూ ఫోన్ విడుద‌ల అయింది. ఈ 28 సంవ‌త్స‌రాల వ్యాపార‌వేత్త మిర్డిఫ్ సిటీ సెంట‌ర్ లో భార‌త్ లో విడుద‌ల అయ్యే కొద్ది గంట‌ల ముందే కొనుగోలు చేశాడు. ఆయ‌న‌కు దుబాయ్ వెళ్లి కొత్త‌గా విడుద‌ల అయ్యే ఐ ఫోన్లు కొనుగోలు చేయ‌టం ఓ స‌ర‌దా. 2017లో తొలిసారి ఇలా చేశాడ‌ట‌. గ‌తంలో అయితే భార‌త్ లో విడుద‌ల కావ‌టానికి కొన్ని వారాల ముందే దుబాయ్ లో ఈ ఫోన్ అందుబాటులోకి వ‌చ్చేద‌ని.. ఇప్పుడు రెండు దేశాల్లో ఇంచుమించు ఒకే స‌మ‌యంలోనే ఫోన్ విడుద‌ల అయినా దుబాయ్ వెళ్లి ఫోన్ కొనుగోలు చేయ‌టం త‌న‌కు ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంద‌ని చెబుతున్నాడు ధీర‌జ్. ఇలాంటి వాళ్ల‌ను చూసే ఎవ‌రి పిచ్చి వాళ్ళ‌కు ఆనందం వంటి సామెత పుట్టుకొచ్చి ఉంటుంది.

Next Story
Share it