Telugu Gateway
Top Stories

జూన్ 14 వ‌ర‌కూ క‌ర్ణాట‌క‌లో లాక్ డౌన్ పొడిగింపు

జూన్ 14 వ‌ర‌కూ క‌ర్ణాట‌క‌లో లాక్ డౌన్ పొడిగింపు
X

క‌రోనా రెండ‌వ ద‌శ‌లో ఎక్కువ ప్ర‌భావానికి గురైన రాష్ట్రాల్లో క‌ర్ణాట‌క ఒక‌టి. నెల రోజుల‌కు పైగా క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టినా ఇంకా క‌రోనా వైర‌స్ వ్యాప్తి గాడిన ప‌డ‌టంలేదు. కాక‌పోతే ఇప్పుడిప్పుడే కేసుల తీవ్ర‌త గ‌ణ‌నీయంగా త‌గ్గుతోంది. అందుకే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం లాక్ డౌన్ పొడిగింపు నిర్ణ‌యం తీసుకుంది. జూన్ 14 వ‌ర‌కూ రాష్ట్రంలో లాక్ డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ మేర‌కు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయని.. మరికొన్ని రోజులు లాక్​డౌన్​ పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలే మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్​ పాజిటివిటీ తీవ్రత 5 శాతానికి తగ్గిందని అన్నారు.

ఈ సారి ప్రత్యేకంగా మత్స్యకారులు, పూజారులు, పవర్‌లూమ్ కార్మికులు..ఇతరులకు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. ప్రతిరోజు నమోదవుతున్న కేసులు కూడా గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. లాక్​డౌన్​ వలన ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రజల జీవనోపాధి కోసం 1,250 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. అలాగే, తమ ప్రభుత్వం ఈ నెలలో 60 లక్షలకు పైగా వ్యాక్సిన్​లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. జూన్​ 30 నాటికి దాదాపు 2 కోట్ల మందికి టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Next Story
Share it