Telugu Gateway
Top Stories

మాంద్యం భ‌యాలు అ క్క‌ర్లేదంటున్న బైడెన్

మాంద్యం భ‌యాలు అ క్క‌ర్లేదంటున్న బైడెన్
X

గ‌త కొంత కాలంగా పలు దేశాల్లో విన్పిస్తున్న మాట మాంద్యం. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌డింది. దీంతో ప‌లు దేశాల్లో గ‌తంలో ఎన్న‌డూలేని రీతిలో ద్ర‌వ్యోల్బణం జ‌డ‌లు విప్పించింది. దీంతో సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ధ‌ర‌లు పెరిగి నానా అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంది. అగ్ర‌రాజ్యం అ మెరికా కూడా దీనికి మిన‌హాయింపు ఏమీకాదు. అక్క‌డ ద్ర‌వ్యోల్బ‌ణం ఏకంగా న‌ల‌భై సంవ‌త్స‌రాల గ‌రిష్ట స్థాయికి చేరింది. దీంతో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్ర‌తిష్ట కూడా మ‌స‌క‌బారింది. తాజాగా ఆయ‌న మాంద్యంపై కీలక‌ వ్యాఖ్య‌లు చేశారు. అమెరిగా ప్ర‌గ‌తి రేటు వేగం త‌గ్గొచ్చేమో కానీ మాంద్యం వ‌స్తుంద‌ని తాను అ నుకోవ‌టం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అమెరికాకు చెందిన అధికారుల‌ది కూడా అదే మాట‌. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్ట‌డి చేసేందుకు అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ వ‌డ్డీ రేట్ల‌ను గ‌ణ‌నీయంగా పెంచింది. ఇప్పుడు మ‌రోసారి ఈ దిశ‌గా ముందుకెళ్లే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. బుధ‌వారం నాడు ఫెడ్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డే ముఖ్యంగా ఫెడ్ మ‌రోసారి కూడా వ‌డ్డీ రే్ట్ల‌ను పెంచే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో ఉద్యోగాలు కూడా పెరుగుతున్నందున మాంద్యం భ‌యాల‌కు ఛాన్స్ లేద‌ని భావిస్తున్నారు. భార‌త్ లోనూ ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌టంతో ఆర్ బిఐ కూడా వ‌ర‌స పెట్టి వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతూ పోతోంది.

Next Story
Share it