ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న జో బైడెన్
BY Admin22 Dec 2020 4:21 AM GMT
X
Admin22 Dec 2020 4:21 AM GMT
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఫైజర్ కు సంబంధించిన కరోనా వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. డెలావేర్ లోని క్రిస్టినా కేర్ ఆస్పత్పిలో ఆయనకు ఈ వ్యాక్సిన్ డోస్ ఇచ్చారు. అమెరికా ప్రజల్లో కోవిడ్ వ్యాక్సిన్ పై విశ్వాసం కల్పించేందుకు సోమవారం నాడు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 20న జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు
. తమ తొలి ప్రాధాన్యత కరోనాను ఎదుర్కొవటమే అని ఇఫ్పటికే బైడెన్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్ పెన్స్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అమెరికాలో ఇప్పటికే వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఫైజర్ కు తోడు మోడెర్నా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
Next Story