Telugu Gateway
Top Stories

జియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు ప్రారంభం

జియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు ప్రారంభం
X

వ‌చ్చేశాయ్ జియో ఫోన్లు. అయితే ఈ ఫోన్ల విక్ర‌యానికి కొత్త ప‌ద్ద‌తి తెర‌పైకి తెచ్చారు. ఈ ఫోన్ కొనుగోలు చేయాలంటే ముందస్తురిజిస్ట్రేషన్తప్పనిసరి అని జియో ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 1,999 రూపాయ‌ల చెల్లింపుతో సులభమైన ఈఎంఐ ప్లాన్లు ఉన్న‌ట్లు జియో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఈ ఫోన్ల విక్ర‌యాలు అందుబాటులోకి వ‌చ్చాయి. వీటిని కొనేవారు, స్టోర్ కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా లేదా కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next) ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనేందుకు వీలుండదు. జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు కోసం రిలయన్స్ ఈఎంఐ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. దీని వల్ల కొనుగోలుదారులు మొదట రూ.1,999 చెల్లిస్తే సరిపోతుందన్నారు. జియో ఫోన్ నెక్ట్స్ కోసం7018270182కు Hi అని వాట్సాప్ చేయడం ద్వారా కూడా కొనుగోలుదారులు తమ ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా వినియోగదారులు తమ లొకేషన్ ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాత స్టోర్ కు వెళ్లి జియో ఫోన్ నెక్ట్స్ కొనుక్కోవాల్సిందిగా వినియోగదారులకు సమాచారం వస్తుంది. ఈ సమాచారం వచ్చిన తరువాత వినియోగదారులు జియో ఫోన్ నెక్ట్స్ ను కొనేందుకు వీలవుతుంది. ఫోన్ వెల రూ.6,499. వినియోగదారులు సులభ ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

ఇందులో వినియోగదారులు మొదటగా రూ.1,999 చెల్లించాలి (రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనం). మిగిలిన మొత్తాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఫోన్ ను తీసుకునేందుకు ఒకటి లేదా రెండు రోజుల తరువాత రావాల్సిందిగా చెప్పే అవకాశం ఉంటుంది. జియో ఫోన్ నెక్ట్స్ కు సులభ యాక్సెస్ ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా కంపెనీ 30,000కు పైగా రిటైల్ అవుట్ లెట్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగితపు రహిత డిజిటల్ ఫైనాన్స్ ఆప్షన్ ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. తద్వారా దీన్ని భౌగోళికంగా ప్రతీ భారతీయుడికీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లయింది. జియో ఫోన్ నెక్ట్స్ కోసం మీరు రూ.1,999 చెల్లిస్తే, మీరు జియో అందించే దిగువ ఈఎంఐ ప్లాన్స్ లో దేన్నయినా ఎంచుకోవచ్చ‌న్నారు. జియో ఫోన్ నెక్ట్స్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

జియో ఫోన్ నెక్ట్స్ అనేది ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. భారతదేశం కోసం తీర్చిదిద్దబడిన ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్. ఇది 5.45 అంగుళాల హెచ్ డి+ (720x1,440 pixels) డిస్ ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ తో వస్తుంది. యాంటీ – ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది. కెమెరా వి భాగంలో జియో ఫోన్ నెక్ట్స్ 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను, 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. రియర్ కెమెరాలో పోట్రాయిట్ మోడ్, నైట్ మోడ్, ప్రి లోడెడ్ కస్టమ్ ఇండియా- అగుమెంటెడ్ రియాలిటీ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫోన్ 1.3 GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 క్వాడ్ – కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 512 జీబీ వరకు విస్తరించుకోగలిగిన 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగిఉంటుంది.జియో ఫోన్ నెక్ట్స్ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంటుంది. మైక్రో – యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూ టూత్ వి4.1, వై-ఫై, డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్స్ ఉంటాయి. జియో ఫోన్ నెక్ట్స్ ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్స్ ను పొందుతుంది. రీడ్ అలౌడ్, లైవ్ ట్రాన్స్ లేట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటాయ‌న్నారు.

Next Story
Share it