Telugu Gateway
Top Stories

బడ్జెట్ అయినా మార్కెట్ కు దారి చూపిస్తుందా?!

బడ్జెట్ అయినా మార్కెట్ కు  దారి చూపిస్తుందా?!
X

భారతీయ స్టాక్ మార్కెట్ లు వరుసగా కుప్పకూలుతున్నాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్ లో ఇన్వెస్టర్లకు వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువ. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అనిశ్చితి మరింత పెరిగింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ వరసగా పతనం అవుతూ వస్తుండటం కూడా మార్కెట్ లపై ప్రభావం చూపిస్తోంది. దీంతో పాటు కొన్ని కీలక కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం కూడా మార్కెట్ పతనానికి కారణంగా చెపుతున్నారు. ఈ తరుణంలో ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ అయినా మార్కెట్ కు దారి చూపిస్తుందా లేదా అనే అనుమానాలు ఇన్వెస్టర్లకు వెంటాడుతున్నాయి. ఇదే కారణంతో సోమవారం నాడు స్టాక్ మార్కెట్ లు కుప్పకూలాయి.

అటు బిఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ భారీగా పతనం అయ్యాయి. దీంతో పలు షేర్ల ధరలు 52 వరాల కనిష్ట స్థాయికి పతనం అయ్యాయి. ఐపీవో తర్వాత కొన్ని రోజులు స్టాక్ మార్కెట్ లో పరుగులు పెట్టిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు గత కొంత కాలంగా వరసగా వస్తున్న నెగిటివ్ న్యూస్ తో ఆఫర్ ప్రైస్ కంటే దిగువకు పతనం అయ్యాయి. ఈ షేర్ సోమవారం ఉదయం 67 . 50 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఆఫర్ ధర కంటే తక్కువే కావటం విశేషం. మరో కీలక కంపెనీ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ కూడా 233 రూపాయలకు పతనం అయింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి. ఈ షేర్ల 52 వారాల గరిష్ట ధర 395 రూపాయలు కావటం విశేషం. ఐపీఓ తో స్టాక్ మార్కెట్ లో మెరుపులు మెరిపించిన బజాజ్ హోసింగ్ ఫైనాన్స్ షేర్లు కూడా 52 వీక్ కనిష్ట స్థాయి 104 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చాలా షేర్ల పరిస్థితి ఇలాగే ఉంది. అయితే బడ్జెట్ లోపు మార్కెట్ మరింత పతనం అయ్యే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ ఇంకా పతనం అయితే పెట్టుబడికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు అని మార్కెట్ విశ్లేషకుల అంచనా.

Next Story
Share it