Telugu Gateway
Top Stories

అంచనాలు దాటిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ ధర

అంచనాలు దాటిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ ధర
X

రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరుపడిన కంపెనీ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్) లిస్టింగ్ కు ముందే రికార్డు లు నమోదు చేసింది. మార్కెట్ నిపుణల అంచనాలను అధిగమించి ఈ షేర్ ధర ఖరారు అయింది. పలు దిగ్గజ బ్రోకరేజ్ సంస్థలు ఈ షేర్ ధర 160 రూపాయల నుంచి 190 రూపాయల మధ్య ఉండొచ్చని అంచనా వేయగా ఇది ఏకంగా 262 రూపాయలుగా నిర్ణయించారు. రిలయన్స్ నుంచి ఆర్థిక సేవల కంపెనీని విభజించేందుకు గురువారం నాడు ప్రీ మార్కెట్ సెషన్ నిర్వహించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రితం రోజు ముగింపు విలువ...గురువారం నాడు చేపట్టిన ప్రత్యేక సెషన్ లో రిలయన్స్ షేర్ విలువ ఆధారంగా జియో ఫైనాన్సియల్ షేర్ విలువను లెక్కగట్టారు. దీంతో ఇది 262 రూపాయలుగా ఖరారు అయింది. రిలయన్స్ షేర్ హోల్డర్లకు ఒక్కో షేర్ కు ఒక జియో ఫైనాన్సియల్ షేర్స్ కేటాయించనున్నారు. జులై 19 నాటికీ ఎవరి దగ్గర అయితే రిలయన్స్ షేర్లు ఉన్నాయో వారందరికీ జియో ఫైనాన్సియల్ షేర్స్ దక్కుతాయి.

అంచనాలు దాటిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ ధరత్వరలోనే ఈ షేర్లు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కానున్నాయి. తాజాగా ఖరారు అయిన 262 రూపాయల లెక్కన జియో ఫైనాన్సియల్ షేర్ మార్కెట్ విలువ అప్పుడే 1 .72 లక్షల కోట్ల ను అధిగమించింది. దీంతో ఇప్పుడు ఇది దేశంలోనే 32 వ విలువైన కంపెనీగా అవతరించింది. ఇది పలు దిగ్గజ కంపెనీల విలువ కంటే ఎక్కువ కావటం విశేషం. రిలయన్స్ నుంచి విడిపోయిన తర్వాత దేశంలోనే ఐదవ అతి పెద్ద ఫైనాన్సియర్ గా జియో ఫైనాన్సియల్ అవతరించనుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పేటిఎం, బజాజ్ ఫైనాన్స్ లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రిలయన్స్ కు ఉన్న నెట్ వర్క్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. గురువారం నాడు కూడా రిలయన్స్ షేర్ ధర 31 రూపాయల లాభంతో 2620 రూపాయల వద్ద క్లోజ్ అయింది.

Next Story
Share it