రెండు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజషన్ క్లబ్ లో
ఇప్పటి వరకు దేశంలోని రెండు లక్షల పైన మార్కెట్ క్యాపిటలైజషన్ కలిగిన కంపెనీలు పన్నెండు ఉంటే..అందులో టాప్ ప్లేస్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారం ప్రారంభించే పనిలో ఉండటం తో పాటు సెక్యూర్డ్ రుణాలపై కంపెనీ ఫోకస్ చేస్తున్న కారణంగానే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ లాభాల బాటలో సాగుతుంది అని చెపుతున్నారు. పేటిఎం పే మెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శుక్రవారం నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2996 రూపాయల కొత్త గరిష్ట స్థాయికి చేరింది.