Telugu Gateway
Top Stories

బిలియనీర్ బంకర్ లో జెఫ్ బెజోస్ మాన్షన్

బిలియనీర్ బంకర్ లో జెఫ్ బెజోస్ మాన్షన్
X

జెఫ్ బెజోస్. అమెజాన్ వ్యవస్థాపకుడు...ప్రపంచంలోని సంపన్నులో మూడవ వ్యక్తి. ఆయన తాజాగా మన భారతీయ కరెన్సీ లో అయితే 560 కోట్ల రూపాయలు పెట్టి ఒక మాన్షన్ కొనుగోలు చేశారు. అమెరికా లోని ఫ్లోరిడా లో ఉన్న బిలియనీర్ బంకర్ లో ఆయన ఈ అత్యంత ఖరీదు అయిన డీల్ పూర్తి చేశారు. బిలియనీర్ బంకర్ గా పిలిచే ఈ ద్వేపంలో కేవలం 40 నివాసాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఉండే వారు అంతా బిలియనీర్లే. ఇందులో కంట్రీ క్లబ్ తో పాటు దీనికి ప్రత్యేక పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా ఉండటం విశేషం.

తాజాగా జెఫ్ బెజోస్ కొనుగోలు చేసిన మాన్షన్ 9300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పటికే జెఫ్ బెజోస్ కు అమెరికాలోని పలు ప్రాంతాల్లో అత్యంత ఖరీదు అయిన నివాసాలు ఉన్నాయి. 2021 లో అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పు కున్న తర్వాత జెఫ్ బెజోస్ అతి ఖరీదు అయిన వస్తువుల కొనుగోలుపై దృష్టి సారించారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, కాస్టిలీ సూపర్ యాచ్ కూడా ఆయన సొంతం. ప్రస్తుతం జెఫ్ బెజోస్ సంపద 163 బిలియన్ డాలర్లు.

Next Story
Share it