మందు అమ్మకాలు పెంచాలి..ఐడియాలు ఇవ్వండి

సహజంగా ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను తగ్గించి..ఈ వ్యసనానికి బానిసలైన వారిని మార్చేందుకు ప్రత్యేక కేంద్రాలు పెట్టాలని కోరుకుంటారు ప్రజలు. కానీ స్వయంగా ఓ దేశమే మద్యం అమ్మకాలు పెంచటానికి ఏకంగా పోటీ పెట్టడం విశేషం. కరోనా కారణంగా గత 31 సంవత్సరాల్లో ఎన్నడూలేని రీతిలో జపాన్ లో మద్యం అమ్మకాలు తగ్గి పన్నుల ఆదాయం పోయింది. పక్కనుండే వారితో కూడా మద్యం తాగించేలా..ప్రోత్సహించేందుకు కొత్త ఐడియాలను ఆహ్వానించారు. అనారోగ్యానికి కారణం అయ్యే మద్యం అమ్మకాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ తరహా కార్యక్రమం చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా..మరికొంత మంది మాత్రం తమకు తోచిన ఐడియాలు చెబుతున్నారు. ప్రజలు తమ ఐడియాలను సెప్టెంబర్ నెలాఖరులోగా పంపాలని ప్రభుత్వం కోరింది.



