గులేరియా వ్యాఖ్యలపై దుమారం
BY Admin6 May 2021 11:45 AM

X
Admin6 May 2021 11:45 AM
సీటీ స్కాన్ లకు సంబందించి ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ (ఐఆర్ఐఏ) తీవ్రంగా ఖండించింది. ఒక సీటీ స్కాన్ 300 నుంచి 400ల ఎక్స్ రేలతో సమానం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు 30-40 సంవత్సరాల నాటి లెక్కలు అని అన్నారు.
గులేరియా లెక్కలకు ఏ మాత్రం శాస్త్రీయతలేదని..కాలం చెల్లిన లెక్కలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సీటీ స్కానర్లు అతి తక్కువ రేడియేషన్ తో ఉంటాయన్నారు..ఒక్కో సీటీ స్కాన్ వల్ల 5 నుంచి 10 ఎక్స్ రేల తో మాత్రమే సమానం అన్నారు. గులేరియా వ్యాఖ్యలు షాక్ కు గురిచేశాయని..తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయని అసోసియేషన్ పేర్కొంది.
Next Story