ఒప్పందమే మార్గం!

ముందు ప్రకటించటం. ఆ తర్వాత వెనక్కి తగ్గటం. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే ఇరాన్ విషయంలో ఆయన తన పరువు కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఎన్ని హెచ్చరికలు చేసిన అమెరికా కోరిన విధంగా ఒప్పందం చేసుకోవటానికి ఇరాన్ ససేమిరా అనటంతో దీనికి ఎలా ముగింపు ఇవ్వాలో ట్రంప్ కు అర్ధం కావటం లేదు. ఈ యుద్ధం కారణం గా అమెరికా లో కూడా ఇంధన ధరలతో పాటు ఇతర ధరలు కూడా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు దేశాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా కు మిత్ర దేశాలుగా ఉన్న పలు గల్ఫ్ దేశాలు కూడా మరో సారి ఇరాన్ పై అమెరికా దాడికి సహకరించే అవకాశం ఏ మాత్రం కనిపించటం లేదు. ఎందుకంటే తమ దేశంపై దాడికి సహకరిస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇప్పటికే పలు మార్లు డ్రోన్లతో దాడులు చేయటంతో ఆయా దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. ఇదే కారణంగా ఇప్పుడు ఖతార్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సేఫ్ గా ఆయా దేశాలకు తరలించేందుకు అని డోనాల్డ్ ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ ను అనౌన్స్ చేసారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో పాకిస్థాన్ కోరిక మేరకు దీన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించి డోనాల్డ్ ట్రంప్ అందరిని ఆశ్చర్యపరిచారు. మళ్ళీ ఇప్పటి వరకు ఆ ఊసు ఎత్తలేదు. తాజాగా డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అదేంటి అంటే తాము ఇరాన్ పై మరో సారి భారీ దాడులకు మంగళవారం నాడు ముహూర్తంగా నిర్ణయించుకున్నాం అని...కానీ ఖతార్, సౌదీ అరేబియా తో ఇతర యూఏఈ దేశాల నాయకుల నుంచి తనకు వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ దాడులు నిలిపివేస్తినట్లు ట్రూత్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్ తో చర్చలు సాగుతున్నందున ఈ దాడులు వాయిదా వేయాలని వాళ్ళు కోరినట్లు చెప్పుకొచ్చారు.
ఇరాన్ తో చర్చలు విఫలం అయి ...ఆ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదరకపోతే మాత్రం ఈ సారి దాడులు విధ్వంసకరంగా ఉంటాయన్నారు. దీనికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే తమ అధికారులను ఆదేశించినట్లు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లు చేసిన యుద్ధం కారణంగా పలు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ యుద్ధంతో ఏ మాత్రం సంబంధం లేని దేశాలు కూడా బాధితులుగా మారిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఇరాన్ పై దాడులు చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ అని...ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందానికే ఎక్కువ ఛాన్సులు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నా ఈ సారి మాత్రం గల్ఫ్ దేశాలు అమెరికా కు ఏ మా



