Telugu Gateway
Top Stories

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
X

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించారు. ఫిబ్రవరి 28 వరకూ ఇది కొనసాగనుంది. ఈ మేరకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే భారత్ నుంచి పలు దేశాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అయితే ఇది పరిమిత సంఖ్యలోనే ఉంది. కరోనా కొత్త రకం వెలుగుచూసి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం నెలకొంది. భారత్ లో కరోనా కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టినా పలు దేశాల్లో కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉండటంతో ఈ పొడిగింపు అనివార్యంగా మారినట్లు కన్పిస్తోంది.

కార్గో విమానాలను ఎటువంటి షరతులు వర్తించవని స్పష్టంచేసింది. దీనికి సంబందించిన ఒక సర్క్యులర్ ను డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్‌ కుమార్‌ జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్‌ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి 'వందే భారత్‌' మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను నడుపుతున్నారు

Next Story
Share it