Telugu Gateway
Top Stories

నిమిషంలో ఏడు కోట్ల కార్లు కొట్టేశారు

నిమిషంలో ఏడు కోట్ల  కార్లు కొట్టేశారు
X

దొంగతనం చేయటం కూడా ఒక ఆర్ట్. అందుకే దీనికి చోర కళ అని పేరు వచ్చింది. ప్రాక్టీస్ ఉంటే తప్ప అందరూ దొంగలు కాలేరు. లేకపోతే అడ్డంగా దొరికిపోతారు. కొద్ది రోజుల క్రితం లండన్ లో పోయిన ఖరీదైన బెంట్లీ కార్ ఏకంగా పాకిస్థాన్ లో ప్రత్యక్షము అయింది. ఇప్పుడు కూడా ఒక సంచలన దొంగతనం నమోదు అయింది. అదేంటి అంటే ఒకే ఒక నిమిషం వ్యవధిలో ఏడు కోట్ల రూపాయల విలువ చేసే కార్లు కొట్టేసారు వాళ్ళు. ఇది ఇంగ్లాండ్ లోని ఎస్సెక్స్ పారిశ్రామిక ఎస్టేట్ లో చోటు చేసుకొంది. ఈ మొత్తం దొంగతనం జరిగిన తీరు అంతా సీసీటీవీల్లో రికార్డు అయింది.

ఇంగ్లాండ్ పోలీసులు ఈ వీడియో షేర్ చేసి తాము ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ దొంగలు అంతా పనిని టీం వర్కులా పక్కా ప్లాన్ తో అమలు చేశారు. వచ్చిన వాళ్ళలో ఒకడు ఈ పారిశ్రామిక వాడ గేట్ ఓపెన్ చేసి పట్టుకోగా. మిగిలిన వాళ్ళు అంతా ఖరీదైన పోర్షే, మెర్సిడస్ మెబాష్, అరుదైన ఎరియల్ ఆటమ్ రేసింగ్ కార్ వంటివి చోరీకి గురైన వాటిలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ భారతీయ కరెన్సీలో ఏడు కోట్ల రూపాయలు ఉంటుంది. మరి వీళ్ళు పోలీసులకు చిక్కుతారా లేదా అన్నది ఆసక్తికరమైన అంశమే.

Next Story
Share it