Telugu Gateway
Top Stories

ఇన్ఫోసిస్ లో 25 వేల కొత్త ఉద్యోగాలు

ఇన్ఫోసిస్ లో 25 వేల కొత్త ఉద్యోగాలు
X

కరోనా ప్రభావం ఉన్నా దేశంలోని అగ్రశ్రేణి ఐటి కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం సానుకూల ప్రకటనలు చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కొత్తగా 25 వేల మందిని నియమించుకునే ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) యూబీ ప్రవీణ్ రావు వెల్లడించారు. దేశంలో 24 వేల మంది కొత్తవారిని, విదేశాల్లో వెయ్యి మందిని ఫ్రెషర్స్ ను తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఆర్ధిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ మొత్తం 21 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోగా..ఇందులో 19 వేల మంది భారత్ లోనే ఉన్నారు.

ఇన్ఫోసిస్ బుధవారం నాడు మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ లాభం 17.1 శాతం మేర పెరిగి 5078 కోట్ల రూపాయలకు చేరింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 13.1 శాతం వృద్ధితో 26,311 కోట్ల రూపాయలకు చేరింది. గత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 16.7 శాతం పెరుగుదలతో 19,423 కోట్ల రూపాయలకు పెరిగింది. అదే సమయంలో ఆదాయాలు లక్ష కోట్ల రూపాయలను దాటేశాయి.

Next Story
Share it