Telugu Gateway
Top Stories

ఇన్ఫోసిస్ విలవిల

ఇన్ఫోసిస్ విలవిల
X

గత మూడేళ్ళ కాలంలో ఎన్నడూ లేని రీతిలో దేశ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం నాడు పతనం అయ్యాయి. దీంతో సోమవారం నాడు స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే ఈ కంపెనీ మార్కెట్ విలువ 73 వేల కోట్ల రూపాయల మేర పతనం అయింది. దీనికి ప్రధాన కారణం గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు అంటే...2023 మార్చితో ముగిసిన కాలంలో లాభాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా లేకపోవటం ఒకటి అయితే..2023 -2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం అంచనాలు బలహీనంగా ఉండటంతో ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల బాట పట్టాయి. దీంతో సోమవారం మార్కెట్ ప్రారంభం నుంచి పెద్ద ఎత్తున నష్టాలతోనే కొనసాగుతోంది.

ఒక దశలో ఇన్ఫోసిస్ షేర్ 52 వరాల కనిష్ట స్థాయి 1219 రూపాయలకు పతనం అయింది. ఇన్ఫోసిస్ ప్రభావం కారణంగా ఇతర ఐటి షేర్లు కూడా నష్టపోయాయి. ఈ ప్రభావం టెక్ మహీంద్రా తో పాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్ సి ఎల్ టెక్ వంటి కంపెనీలపై కూడా పడింది. ఈ షేర్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. . 2023 జనవరి- మార్చి కాలంలో ఇన్ఫోసిస్ 6128 కోట్ల రూపాయల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ లాభం 5696 కోట్ల రూపాయలుగా ఉంది. ఇన్ఫోసిస్ ఫలితాలకు తోడు అంతర్జాతీయ అంశాలు కూడా మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపించాయి.

Next Story
Share it