Telugu Gateway
Top Stories

ఇండిగో ఫ‌స్ట్..విస్తారా సెకండ్

ఇండిగో ఫ‌స్ట్..విస్తారా సెకండ్
X

కోవిడ్ త‌ర్వాత ఇప్పుడిప్పుడే విమాన‌యాన రంగం గాడిన ప‌డుతోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి-జులై కాలంలో దేశ వ్యాప్తంగా 6.69 కోట్ల మంది విమాన ప్ర‌యాణికులు రాక‌పోక‌లు సాగించారు. ఇది పూర్తిగా దేశీయ విమాన ప్ర‌యాణికుల సంఖ్య మాత్ర‌మే. అయితే జూన్ తో పోలిస్తే జులైలో మాత్రం దేశీయ ప్ర‌యాణికుల సంఖ్య‌లో తగ్గు ముఖం న‌మోదు అయింది. జూన్ లో 1.05 కోట్ల మంది దేశీయ ప్ర‌యాణికులు రాక‌పోకలు సాగించ‌గా..జులైలోఈ సంఖ్య 97 ల‌క్షలుగా ఉంది.

డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) తాజాగా ఈ గ‌ణాంకాల‌ను విడుద‌ల చేసింది. దేశీయ మార్కెట్లో జులై నెల‌లో ఇండిగో 58.8 శాతం వాటా ద‌క్కించుకుంది. స‌హ‌జంగా వ‌ర్షాకాలంలో విమాన ప్ర‌యాణికుల సంఖ్య త‌క్కువ‌గానే ఉంటుంది. ఇండిగో విమానాలు జులై నెల‌లోనే 57.11 ల‌క్షల మంది ప్ర‌యాణికుల‌ను త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేర్చింది. ఇండిగో త‌ర్వాత విస్తారా ఎయిర్ లైన్స్ 10.13 ల‌క్షల మంది ప్ర‌యాణికుల‌తో రెండ‌వ స్థానంలో నిలిచింది.

Next Story
Share it