Telugu Gateway
Top Stories

ఎయిర్ బస్ తో ఇండిగో ఒప్పందం..500 విమానాల కొనుగోలు

ఎయిర్ బస్ తో ఇండిగో ఒప్పందం..500 విమానాల కొనుగోలు
X

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో కొత్త విమానాల కొనుగోలుకు సంబంధించి రికార్డు ఆర్డర్ ఇచ్చింది. పారిస్ ఎయిర్ షో లో ఈ మేరకు ఇండిగో - ఎయిర్ బస్ ల మధ్య ఒప్పందం జరిగింది. విమానయాన రంగంలో ఇదే అతి పెద్ద డీల్ గా చెపుతున్నారు. ఈ డీల్ ప్రకారం ఎయిర్ బస్ ఇండిగో కు 500 విమానాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా కొద్ది రోజుల క్రితం 470 విమానాల కొనుగోలుకు బోయింగ్, ఎయిర్ బస్ లకు ఆర్డర్ పెట్టిన విషయం తెలిసింది.

ఇప్పుడు ఇండిగో ఎయిర్ ఇండియా కంటే ఎక్కువ విమానాల కోసం ఆర్డర్ ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థలుగా ఉన్న ఎయిర్ ఇండియా, ఇండిగో లు పెద్ద ఎత్తున విస్తరణ బాటలో నడవనున్నాయి. దేశీయ రూట్ల తో పాటు అంతర్జాతీయ గమ్య స్థానాలకు తమ తమ సర్వీస్ లు పెంచే పనిలో ఈ రెండు ఎయిర్ లైన్ ఉన్న విషయం తెలిసిందే. తాజా ఆర్డర్ ప్రకారం ఇండిగో కు కొత్త విమానాలు 2030 నుంచి 2035 సంవత్సరాల మధ్య అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో ఎప్పటిలాగానే ఏ 320 విమానాలు సేకరించనుంది.

Next Story
Share it