Telugu Gateway
Top Stories

భారత్ లో యూజర్లు రెండున్నర గంటలు అందులోనే

భారత్ లో యూజర్లు రెండున్నర గంటలు అందులోనే
X

సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది మంచి కంటే చెడు కే ఎక్కువ ఉపయోగ పడుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. రాజకీయ పార్టీలు...పార్టీల సైన్యం ప్రవేశించాక ఇది మరింత దారుణంగా మారిపోయింది. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అబద్దాలు ప్రచారం చేయటంలో మాకేమి తక్కువ అంటూ ముందు వరుసలో ఉంటున్నారు. సోషల్ మీడియా కు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటి అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ను వాడుతున్న వారి సంఖ్య 500 కోట్లు. పైగా వీళ్ళు అంతా చురుగ్గా సోషల్ మీడియా ను వాడుతున్న వాళ్లే. ప్రస్తుత ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే అన్ని రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో కలుపుకుని 500 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇండియాలో ఒక్కో యూజర్ రోజుకు రెండున్నర గంటల సమయాన్ని ఇందులో వినియోగిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యధికంగా సోషల్ మీడియాను వాడేది బ్రెజిల్ దేశస్థులు. వాళ్ల వినియోగం రోజుకు 3 .49 గంటలు ఉంది..జపాన్ లో మాత్రం ఇది రోజు కు గంట కంటే తక్కువగా ఉండటం విశేషం. గత ఏడాది లో సోషల్ మీడియా లోకి కొత్తగా 17 కోట్ల మందికి పైగా ప్రవేశించారు. వివిధ దేశాల్లో ప్రతి పదకొండు మందిలో ఒకరు సోషల్ మీడియా ఉపయోగిస్తుంటే..భారత్ లో మాత్రం ప్రతి ముగ్గురిలో ఒకరు సోషల్ మీడియా ను ఉపయోగిస్తున్నారు. ఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ గా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ లు ఉండగా...తర్వాత జాబితాలో చైనా కు చెందిన వీఛాట్, టిక్ టాక్, డైయిన్ లు ఉన్నాయి. వీటితో పాటు ట్విట్టర్, టెలిగ్రామ్ తదితర యాప్ లకు కూడా పెద్ద ఎత్తున వినియోగ దారులు ఉన్నారు. రాబోయేది ఎన్నికల సీజన్ కావటం తో సోషల్ మీడియా లో రాజకీయ రచ్చ మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పొచ్చు.

Next Story
Share it