వీసా లేకుండానే థాయిలాండ్ వెళ్లొచ్చు
టూరిస్ట్ లను ఆకర్షించటానికి దేశాలు పోటీ పడుతున్నాయి. అక్టోబర్ నెలలలోనే రెండు దేశాలు ఈ మేరకు కీలక ప్రకటనలు చేశాయి. భారతీయ పర్యాటకులకు ఇప్పుడు థాయిలాండ్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అది ఏంటి అంటే భారతీయులు ఇప్పుడు వీసా లేకుండానే పర్యాటకంగా ప్రపంచంలో కీలకమైన దేశంగా ఉన్న థాయిలాండ్ వెళ్లొచ్చు. నవంబర్ 10 నుంచి 2024 మే 10 వరకు వీసా లేకుండా భారతీయులు ఆ దేశంలో 30 రోజులు ఉండొచ్చు. ఈ మేరకు థాయిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సౌకర్యం ఇండియా తో పాటు తైవాన్ కు కూడా కల్పించారు. భారత్ నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు థాయిలాండ్ వెళతారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా పౌరులకు థాయిలాండ్ వీసా లేకుండా పర్యటించే వెసులు బాటు కల్పించింది. గత నెలలోనే వాళ్లకు ఈ సౌకర్యం కల్పించారు. థాయిలాండ్ కు పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.