ఈ నెల 13 నుంచే దేశంలో వ్యాక్సినేషన్
BY Admin5 Jan 2021 7:05 PM IST
X
Admin5 Jan 2021 7:05 PM IST
దేశంలో వ్యాక్సినేషన్ కు సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే డీసీజీఐ సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కు చెందిన కోవ్యాగ్జిన్ కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. డ్రైరన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా వాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
కేంద్రం నుంచి అనుమతి వచ్చిన 10 రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే 29 వేల కోల్డ్ చైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అలానే దేశవ్యాప్తంగా నాలుగు డిపోలు.. 37 రాష్ట్రాల్లో స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది.
Next Story