Telugu Gateway
Top Stories

దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడు

దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడు
X

మరో కొత్త శిఖరం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇటీవల కాలంలో రోజుకో శిఖరానికి చేరుకుంటున్నాయి. వరస పెట్టి దూసుకెళుతున్నాయి. అప్పుడప్పుడు కరెక్షన్లు వచ్చినా అది తాత్కాలికమే అవుతుంది. సోమవారం నాడు మార్కెట్ ప్రారంభం నుంచి జోష్ లోనే ఉంది. తొలిసారి బీఎస్ఈ సెన్సెక్స్ 52వేల పాయింట్ల మార్క్ ను దాటింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 548 పాయింట్ల లాభంతో 52093వద్ద కొనసాగుతోంది. అటు బ్యాంకింగ్‌ కౌంటర్‌ కూడా శుక్రవారం నాటి జోష్‌ను కొనసాగిస్తోంది.

దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్ లాభంతో ఉన్నాయి. ఇండెక్స్ హెవీవెయిట్స్ ఇన్ఫోసిస్ రిలయన్స్ ఇండస్ట్రీస్,ఎస్‌బీఐ కూడా లాభపడుతున్నాయి.

Next Story
Share it