Telugu Gateway
Top Stories

కీలక కంపెనీల్లో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

కీలక కంపెనీల్లో కొత్తగా 80 వేల ఉద్యోగాలు
X

భారత్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) జాబ్ మార్కెట్ రికవరీ బాటలో పడనుందా?. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే అవుననే సమాధానం వస్తోంది. గత రెండేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది ఐటి రంగంలో ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుంది అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ ఇటీవల ఇండియాలోని దిగ్గజ కంపెనీలు 2024 -2025 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన ఆర్థిక ఫలితాల వెల్లడి సమయంలో ఫ్రెషర్స్ ను ఉద్యోగాల్లోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించాయి. ఈ కంపెనీల ప్రకటనలు చూస్తే మొత్తం మీద దేశంలోనే 80000 వేల మంది ఫ్రెషర్స్ కు జాబ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో అగ్రశ్రేణి ఐటి కంపెనీ టిసిఎస్ ఒక్కటే కొత్తగా నలభై వేల మంది ఫ్రెషర్స్ ను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టిసిఎస్ తో పాటు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సిఎల్ టెక్నాలజీ తదితర సంస్థలు కలిపి మొత్తం ఎనభై వేల వరకు కొత్త వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ముఖ్యంగా ఐటి రంగం కొత్త నైపుణ్యాలను కలిగిన వాళ్లపై కూడా ఫోకస్ పెడుతున్నాయి. మారుతున్నా ట్రెండ్ కు అనుగుణంగా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరచుకునే వాళ్ళకే ఐటి రంగంలో మెరుగైన అవకాశాలు దక్కుతాయని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. మొత్తానికి ఇండియా ఐటి జాబ్ మార్కెట్ లో రికవరీ స్టార్ట్ అవటం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది చివరికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా పూర్తి కానున్నాయి. ఆ తర్వాత అక్కడ కూడా జాబ్ మార్కెట్ జోష్ అందుకునే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇప్పటికే కొంత మేర పరిస్థితి మెరుగు అయినట్లు సమాచారం. గత కొంత కాలంగా అమెరికా లో ఎంఎస్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తీసి వేయటం తప్ప...కొత్త ఉద్యోగాలు లేని పరిస్థితి ఇప్పటి వరకు అక్కడ కూడా . త్వరలోనే అమెరికా లో కూడా జాబ్ మార్కెట్ గాడిన పడుతుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story
Share it