Telugu Gateway
Top Stories

కొన్నది భారతీయ పారిశ్రామికవేత్త

కొన్నది భారతీయ పారిశ్రామికవేత్త
X

భారతీయ బిలియనీర్లు విదేశాల్లో వందలు...వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే నివాసాలు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మంది భారతీయ బిలియనీర్లు దుబాయిలో సంపున్నుల ఉండే చోట కొనుగోళ్లు చేస్తారు. భారత్ కు చెందిన దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఫ్యామిలీ దుబాయిలో ఇటీవల కాలంలో రెండు ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దుబాయ్ తో పాటు భారతీయ సంపన్నులు లండన్ లో కూడా విలాసవంత మైన భవనాలు కొనుగోలు చేస్తారు. తాజాగా దీనికి సంబంధించి ఆసక్తికార వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎస్సార్ గ్రూప్ కు చెందిన బిలియనీరు రవి రుయా 1191 కోట్ల రూపాయల వ్యయంతో లండన్ లో ఒక మాన్షన్ కొనుగోలు చేశారు.

ఇది 25800 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. ఆఫ్ షోర్ కంపెనీ ద్వారా ఈ కొనుగోలు నిర్వహించారు. ఇది లండన్ నగరంలో జరిగిన అతి పెద్ద నివాస సముదాయాల డీల్స్ లో ఒకటి. ఈ మాన్షన్ ఒకప్పుడు రష్యా కు చెందిన ప్రాపర్టీ ఇన్వెస్టర్ ఆండ్రి గొంచెరెంకో చేతిలో ఉండేది. 2012 లో కొనుగోలు చేశారు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఇది ఇప్పుడు ఎంతో ఆకర్షణీయమైన పెట్టుబడిగా కనిపించినట్లు రుయా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Next Story
Share it