Telugu Gateway
Top Stories

భారత్ లో లాక్ డౌన్ పెట్టకపోతే ఆ నష్టం ఊహించలేం

భారత్ లో లాక్ డౌన్ పెట్టకపోతే ఆ నష్టం ఊహించలేం
X

లాక్ డౌన్..లాక్ డౌన్. గత కొన్ని రోజులుగా నిపుణులు చెబుతున్న మాట. కానీ కీలక స్థానాల్లో ఉన్న నేతలు మాత్రం లాక్ డౌన్ కు నో అంటున్నారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కొంత మంది ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా లాక్ డౌన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని తేల్చేశారు. ఈ తరుణంలో మరోసారి ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ అంటోనీ పౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో లాక్ డౌన్ పెట్టకపోతే జరిగే నష్టం ఊహించటం కష్టం అని వ్యాఖ్యానించారు. నిత్యం లక్షల్లో నమోదవుతున్న కేసులు, వేల సంఖ్యలో మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌లో వెంటనే 3 లేదా 4 వారాలపాటు లాక్‌డౌన్ విధించాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ సంక్రమణను బ్రేక్ చేయడానికి లాక్‌డౌన్ తప్పదన్నారు. లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన వద్దని, లాక్‌డౌన్‌ కారణంగా కలిగే ఆర్థిక నష్టం కంటే పెట్టకపోతే వచ్చే నష్టం ఇంకా పెద్దదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని, వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలని తెలిపారు. ఎక్కువ కంపెనీల్లో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలన్నారు.

Next Story
Share it