Telugu Gateway
Top Stories

సింగ‌పూర్ నుంచి భార‌త్ కు నిధుల ప్ర‌వాహం

సింగ‌పూర్ నుంచి భార‌త్ కు నిధుల ప్ర‌వాహం
X

భార‌త్ కు విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు (ఎఫ్ డిఐ) ఎక్క‌డ నుంచి వ‌స్తున్నాయో తెలుసా?. ఇందులో తొలి స్థానం సింగ‌పూర్ ది అయితే రెండ‌వ స్థానంలో అమెరికా ఉంది. గ‌త ఆర్ధిక సంవ‌త్స‌రంలో అంటే 2022 మార్చితో ముగిసిన నాటికి బార‌త్ లోకి రికార్డు స్థాయిలో 6.31 ల‌క్షలకోట్ల రూపాయ‌ల విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడులు వ‌చ్చాయి. ఇందులో సింగ‌పూర్ వాట 27.01 శాతం ఉంటే..అమెరికా వాటా 17.94 శాతం ఉంది. అదే స‌మ‌యంలో వచ్చిన ఎఫ్ డిఐలు అన్నీ కూడా ఎక్కువ‌గా ఏ రంగంలోకి వ‌చ్చాయంటే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాలు ఉండ‌టం విశేషం. ఎఫ్ డిఐల ఆక‌ర్ష‌ణ‌లో క‌ర్ణాట‌క మొద‌టి స్థానంలో ఉండ‌గా..మ‌హారాష్ట్ర రెండ‌వ స్థానంలో ఉంది.

సింగ‌పూర్, అమెరికా త‌ర్వాత భార‌త్ కు ఎఫ్ డిఐల రూపంలో నిధులు స‌మ‌కూర్చిన వాటిలో మారిష‌స్, నెద‌ర్లాండ్, స్విట్జ‌ర్లాండ్ దేశాల ఉన్నాయి. ప్ర‌పంచ పెట్టుబ‌డుల నివేదిక ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది. కేంద్రం కూడా ఎఫ్ డిఐల‌ను ప్రోత్స‌హించేందుకు వీలుగా ప‌ల రంగాల్లో ఆటోమోటిక్ రూట్ ను అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. ఎఫ్ డిఐల రూపంలో భారత్ లోకి 6.31 ల‌క్షలకోట్ల రూపాయ‌లు వ‌చ్చినా..విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్ట‌ర్లు (ఎఫ్ పిఐలు) మాత్రం దేశం నుంచి 1.22 ల‌క్షలకోట్ల రూపాయ‌ల మేర పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించారు. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న అనిశ్చితి ప‌రిస్థితుల కార‌ణంగానే ఎఫ్ పిఐలు పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించార‌ని భావిస్తున్నారు.

Next Story
Share it