Telugu Gateway
Top Stories

భార‌త్ అంటే బిజినెస్

భార‌త్ అంటే బిజినెస్
X

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ హైద‌రాబాద్ లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) ఇర‌వైవ వార్షికోత్స‌వంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు భార‌త్ అంటే బిజినెస్ గా మారిపోయింద‌ని అన్నారు. ఒక‌ప్పుడు సంస్క‌ర‌ణ‌ల అమలుకు రాజ‌కీయాలు అడ్డంకిగా ఉండేవ‌ని..2014 నుంచి దేశంలో సంస్క‌ర‌ణ‌ల వేగం పెరిగింద‌ని మోడీ వ్యాఖ్యానించారు. ఈ స‌మావేశంలో మోడీ ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. 'దేశ పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. యువత కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. కరోనా సమయంలో భారత్‌ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశానికి ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇప్పుడు ఇండియా అంటేనే బిజినెస్‌. భారత యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది. మా ప్రభుత్వం దేశ యువతకు అండగా నిలబడుతోంది. రాజకీయ అస్థిరత వల్ల మూడు దశాబ్ధాలుగా దేశం పాలసీ నిర్ణయాలు తీసుకోలేకపోయింది.

ఎనిమిదేళ్లుగా నిరాటకంగా సంస్కరణలు చేపడుతున్నాం. దేశంలో 8 ఏళ్లుగా మెడికల్‌ కాలేజీల సంఖ్య పెంచుకున్నాం. వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామన్నారు.. కరోనా వ్యాక్సిన్‌ను కూడా దేశీయంగా అభివృద్ధి చేసుకున్నాం. భారత ఉత్పత్తులకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. దేశ పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. యువత కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. కరోనా సమయంలో భారత్‌ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. టెక్నాల‌జీ రంగంలో కూడా భార‌త్ ప‌లు విభాగాల్లో ముందు ఉన్న‌ద‌ని తెలిపారు. భార‌త్ సాధించిన ఘ‌న‌త‌లో ఐఎస్ బీ, ఇక్క‌డి విద్యార్ధుల పాత్ర ఎంతో ఉంద‌ని ప్ర‌శంసించారు. వ్య‌క్తిగ‌త టార్గెట్ల‌ను దేశ టార్గెట్ల‌తో స‌మ‌న్వ‌యం చేయాల‌ని..అప్పుడే దేశ ప్ర‌గ‌తి ప‌రుగులు పెడుతుంద‌ని తెలిపారు. రిఫార్మ్, ప‌ర్మార్ప్, ట్రాన్స్ ఫార్మ్ నినాదంతో ప్ర‌భుత్వం ముందుకెళుతోంద‌ని తెలిపారు.

Next Story
Share it